తొర్రూర్ మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు
మొదటి వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ ముందంజ
ఇతర వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ ఆధిక్యం
కాకతీయ, తొర్రూర్ : మహబూబాబాద్ తోర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. వివిధ వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆధిక్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. మున్సిపాలిటీలోని 1వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జయమ్మ భూసాని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఆమెకు ఓటర్ల మద్దతు లభించడంతో ప్రత్యర్థులపై ముందంజలో నిలిచారు. అదేవిధంగా మరో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రావణ్ ఆధిక్యం సాధిస్తూ విజయం వైపు దూసుకెళుతున్నారు. ప్రారంభ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మిగతా వార్డుల ఫలితాలు క్రమంగా వెలువడనున్న నేపథ్యంలో చివరి ఫలితాలపై స్థానిక ప్రజలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


