బండి సంజయ్ పరామర్శ
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో గాయపడ్డ బీజేపీ నేత, గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. 58వ డివిజన్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. ఈ ఘటనలో అజయ్ వర్మకు మోచేయి, కాలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కరీంనగర్లోని కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ వర్మను బండి సంజయ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


