ఆధునిక సాంకేతికతతో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవంతంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికిలోనైన దుర్షేడ్ గ్రామానికి చెందిన వేల్పుల తిరుపతి (27) స్వచ్ఛందంగా ఇంటి నుండి వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా, మిస్సింగ్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు తిరుమలకు వెళ్లి అతన్ని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత వినియోగంతో మిస్సింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించ గలుగుతున్నామని తెలిపారు.


