లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
కాకతీయ, జమ్మికుంట: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్ ప్రధాన ఉద్దేశం దేశంలో కార్మికొద్యమాన్ని దెబ్బతీయడం ద్వారా పెట్టుబడికి దాని దోపిడీకి ఆటంకాలు లేకుండా చేయడం అని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మికవర్గంపై పనిగంటల భారాన్ని పెంచుతూ కార్మిక జన సమూహాన్ని కట్టు బానిసలుగా పెట్టుబడుదారికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలు ఉన్నాయని వెంటనే ఈ చట్టాలను ఉప సంహరించుకునే అంత వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు. సిఐటియు మండల అధ్యక్షులు రేణిగుంట్ల సారయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి శ్రీకాంత్, సంతోష్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కన్వీనర్ జముఖం వెంకన్న, కోకన్వీనర్ రావుల ఎల్లయ్య, గ్రామపంచాయతీ యూనియన్ గాదసిరి సంపత్, తోడం శ్రీనివాస్, సారయ్య, చంద్రయ్య, సత్తి, మధుకర్, రమేష్, సమ్మయ్య, రాజయ్య, వీరస్వామి, సాంబయ్య, శ్రీనివాస్, ఆనందం, కుమార్, శ్యామ్, తిరుపతి, పాల్గొన్నారు.


