epaper
Monday, March 2, 2026
epaper

ద్విచక్ర వాహన చోరీల ముఠా గుట్టురట్టు

ద్విచక్ర వాహన చోరీల ముఠా గుట్టురట్టు
నలుగురు మైనర్లతో పాటు ఏడుగురు అరెస్టు
రూ.15 లక్షల విలువైన 15 బైకులు స్వాధీనం
వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోనూ చోరీలు
టెక్నాలజీ సహాయంతో నిందితుల గుర్తింపు
వివరాలు వెల్ల‌డించిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను సంగెం పోలీసులు గురువారం అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు ఉండగా, వారిలో నలుగురు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన మేజర్ నిందితులు దరాంగుల అంజీ, జైదా రామకృష్ణ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వివరాల ప్రకారం, ఒకే ప్రాంతానికి చెందిన ఈ యువకులు స్నేహితులుగా తిరుగుతూ మద్యం సేవలకు అలవాటు పడ్డారు. వారి ఖర్చులకు డబ్బు సరిపోకపోవడంతో సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో పార్క్ చేసి తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో రహస్యంగా దాచేవారు. నిందితులు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, సంగెం, హసన్‌పర్తి, మిల్స్ కాలనీ స్టేషన్ల పరిధిలో రెండేసి, ధర్మసాగర్‌లో ఒకటి, హైదరాబాద్ మడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 1న సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాలపల్లి గ్రామంలో జరిగిన ద్విచక్ర వాహన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు గవిచర్ల గ్రామంలోని గుండు సమ్మయ్య ఆలయం వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు నిందితులు ప్రయాణిస్తున్న చోరీ వాహనాలను పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించడంతో పాటు వారి సమాచారం మేరకు పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో దాచిన మిగిలిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చోరీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ వెంకట్, సంగెం సీఐ, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img