ఒకే రౌండ్లో జమ్మికుంట ఫలితం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ తెలిపారు. ఇందుకోసం 5 హాల్లలో 30 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 30 మంది సూపర్‌వైజర్లు, 60 మంది అసిస్టెంట్లు విధుల్లో ఉంటారని, ప్రక్రియ మొత్తం ఒకే రౌండ్లో పూర్తికానుందని ఆయన వివరించారు


