epaper
Sunday, March 1, 2026
epaper

ఓటెత్తారు…!

ఓటెత్తారు…!
ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్లు
పెరిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ శాతం
ఏ కేంద్రంలో చూసినా భారీగా క్యూలైన్లు
అక్క‌డ‌క్క‌డా స్వ‌ల్ప ఉద్రిక్త‌తలు
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
ఓటింగ్ రోజు కొన‌సాగిన డ‌బ్బుల పంపిణి

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది. జనగామ నుంచి వరంగల్ వరకు అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ తదితర 12 మున్సిపాలిటీల పరిధిలో 260కుపైగా వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా సాగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు కనిపించాయి. యువత, మహిళలు, వృద్ధులు అన్నివర్గాల వారు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ మధ్య ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు విజయవంతంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.

జనగామ జిల్లాలో భారీ స్పందన

జనగామ జిల్లాలో ఓటర్లు భారీగా తరలిరావడంతో మొత్తం 80.66 శాతం పోలింగ్ నమోదైంది. జనగామ మున్సిపాలిటీలో 79.06 శాతం, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 84.47 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. గంటలవారీగా పోలింగ్ శాతం క్రమంగా పెరిగింది. ప్రజల్లో నెలకొన్న చైతన్యమే ఈ భారీ స్పందనకు కారణమని అధికారులు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 78.90 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 98 వార్డులు, 193 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగ్గా 1,27,682 మంది ఓటర్లలో 1,00,744 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీల వారీగా చూస్తే – మరిపెడలో 85.36%, కేసముద్రంలో 86.14%, డోర్నకల్‌లో 81.88%, తొర్రూరులో 77.99%, మహబూబాబాద్‌లో 75.60% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం అధికంగా కనిపించింది.

పరకాలలో 80.16 శాతం

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 80.16 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 26,784 మంది ఓటర్లలో 21,469 మంది ఓటు వేశారు. 44 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా, సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. 100 శాతం వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను అధికారులు పర్యవేక్షించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 65.18 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 34,367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేకంగా కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. నర్సంపేటలో 85.21 శాతం, వర్ధన్నపేటలో 86.23 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతమైంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా, అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఎక్కడ ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి.

మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
మున్సిపాలిటీ పోలింగ్ శాతం
జనగామ 79.06%
స్టేషన్ ఘన్‌పూర్ 84.47%
మరిపెడ 85.36%
కేసముద్రం 86.14%
డోర్నకల్ 81.88%
తొర్రూరు 77.99%
మహబూబాబాద్ 75.60%
పరకాల 80.16%
భూపాలపల్లి 65.18%
ములుగు 80.41%
నర్సంపేట 85.21%
వర్ధన్నపేట 86.23%

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img