మల్లంపల్లి టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తినీ సునీల్ ఎన్నిక
కాకతీయ, ములుగు ప్రతినిధి : మల్లంపల్లి మండల కేంద్రంలో సమ్మక్క–సారక్క టిప్పర్ అసోసియేషన్ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల టిప్పర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బత్తినీ సునీల్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా గుగులోతు శ్రీనివాస్ నాయక్, కోశాధికారిగా కుక్కల సంపత్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల బాలరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్లు, యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసి సభ్యుల సంక్షేమానికి అనుకూలంగా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


