విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ
కాకతీయ ,ఇనుగుర్తి:మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్లో మంగళవారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గంజి అర్చన రెడ్డి తెలిపారు. సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర పోషించడం వల్ల నాయకత్వ గుణాలు అభివృద్ధి చెందుతాయని మాట్లాడే ధైర్యం మరియు స్పష్టత పెరుగుతుందని, డిఇఓగా గా ఎం,డి అఫాన్, ఎంఈఓ ముల్క యగ్నేష్, ప్రిన్సిపాల్ కాయితోజు మహోన్నత్, వ్యాయామ ఉపాధ్యాయునిగా కొనకటి అభినవ్ వ్యవహరించగా, బోధనలో మంచి నైపుణ్యం కనబరిచిన దేవులపల్లి క్రితిక్, గుండెబోయిన శ్రీవల్లి కి బహుమతులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు


