జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంటమున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారుల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.మొత్తం 30 వార్డుల పరిధిలో 34,445 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు .ఈ మేరకు అధికారులు 60 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు .సుమారు 700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రతిష్ట చర్యలు తీసుకున్నామని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ,ఎన్నికల నిబంధనలు పాటించాలని 144 సెక్షన్ ,అమల్లో ఉంటుందని,మున్సిపాలిటీ కమిషనర్ మహ్మద్ ఆయాజ్ తెలిపారు.


