ఘనంగా పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం
కాకతీయ, నర్సింహులపేట : పీఆర్టీయూ టీఎస్ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని నర్సింహులపేట మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎర్ర పూర్ణచందర్ సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు లేని రోజుల్లో సామల యాదగిరి నేతృత్వంలో మానుకోట గడ్డపై పుట్టిన ఈ సంఘం నేడు రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కీలకంగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా మాత్రమే కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలకు దిక్సూచిలా పీఆర్టీయూ టీఎస్ మారిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండ సంజీవ, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బాధ్యులు వెంకటరెడ్డి, శేఖర్, మోహన్ రెడ్డి, మండల నాయకులు శ్రీను, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.


