ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి
సర్పంచ్:పెదమాముల యాకయ్య
కాకతీయ,నర్సింహులపేట: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని,సనాతన హైందవ ధర్మానికి,సంస్కృతికి ఆలయాలు నిదర్శనమని సర్పంచ్ పెదమాముల యాకయ్య పేర్కొన్నారు.సోమవారం మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర నవగ్రహ ప్రసన్నాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కరపత్రాలను ప్రధాన అర్చకులు శ్రీ దేవేంద్రశర్మ,ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ ఆలయాలను సంరక్షించుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కాస యాకయ్య,6వ వార్డు సభ్యురాలు షేక్ హసీనా,శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ మాజీ చైర్మన్ లు మంచినీళ్ళ లక్ష్మి నారాయణ రెడ్డి,బొల్లం రమేష్ బాబు,వేముల నరసింహా రెడ్డి,బోల్లోజు శ్రీనివాసచారి,ఎర్ర వెంకట్ రాం నర్సయ్య,ఎరనాగి వెంకన్న,దోమల యాదగిరి,లెక్కల సంపత్ తదితరులు పాల్గొన్నారు


