ప్రజల మధ్యే పెరిగాను… వార్డు అభివృద్ధే లక్ష్యం
26వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నెల్లుట్ల నరేష్ హామీ
సమస్యల పరిష్కారానికే పోటీ చేస్తున్నానని వెల్లడి
కాకతీయ, సిరిసిల్ల : పదవుల కోసం కాదు… ప్రజాసేవ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సిరిసిల్ల పట్టణ 26వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నెల్లుట్ల నరేష్ అన్నారు. చిన్నప్పటి నుంచి ఇదే వార్డులో పెరిగి ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని, అందుకే వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకొచ్చానని తెలిపారు.డిగ్రీ విద్యతో పాటు సేవాభావాన్ని అలవర్చుకున్న నరేష్, పదవిలో లేకపోయినా అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో కొత్తగా రెండు బోర్లు వేయించడంతో పాటు పనిచేయని బోరును మరమ్మతు చేయించానన్నారు. గుంతలుగా మారిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపశమనం కలిగించానని వివరించారు. కౌన్సిలర్‌గా గెలిపిస్తే ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలతో ప్రజల విశ్వాసం పొందిన నరేష్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.


