epaper
Saturday, November 15, 2025
epaper

ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్ధులు..సీఎం చంద్రబాబును కలిసి సంతోషాన్ని పంచుకున్న స్టూడెంట్స్..!!

కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌లో విజయం సాధించిన విద్యార్ధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి… మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు… రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రోత్సహించండి… స్ఫూర్తినింపండి :

‘విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలు రూపుదిద్దుకోవాలి. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదు. వారికి సరైన వసతులు, ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా ఉంది. ఇందుకు 55 మంది విద్యార్థులే నిదర్శనం. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి నాలుగు రెట్లు పెరగాలి. ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యాసంస్థకు వెళ్లి అక్కడ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలి.’ అని ముఖ్యమంత్రి విద్యార్థులతో అన్నారు.

356 మందికి శిక్షణ… 55 మంది ఎంపిక :

కర్నూలు జిల్లా చిన్నటేకూరు, ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో వీరంతా కోచింగ్ తీసుకుని ర్యాంకులు సాధించారు. ఈ సెంటర్లలో జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్‌లో 176 మంది శిక్షణ పొందగా 129 మంది క్వాలిఫై అయ్యారు. నీట్‌కు 180 మంది కోచింగ్ తీసుకోగా 143 మంది క్వాలిఫై అయ్యారు. చివరగా ఐఐటీలో 12 మంది, నిట్‌లో 30 మంది, నీట్ ఎంబీబీఎస్‌లో 13 మంది విద్యార్ధులు సీట్లు సాధించారు. మొత్తం 55 మంది విద్యార్ధుల్లో 20 మంది విద్యార్ధినులు ఉండటం విశేషం. వీరు కాకుండా బీడీఎస్‌లో మరో 14 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. జీఎఫ్‌టీఐ, సెంట్రల్ యూనివర్సిటీల్లో 19 మందికి సీట్లు లభిస్తాయి.

ఈ ఏడాది కొత్తగా 7 కోచింగ్ సెంటర్లు :

ఈ ఏడాది కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే సెంటర్లతో 1,411 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుంది. బడుగు, బలహీన వర్గాల విద్యార్ధుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశం చివరిలో ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన విద్యార్ధులకు మెమొంటోలు, ఒక్కో విద్యార్ధికి రూ.లక్ష చొప్పున చెక్ స్వయంగా అందించి వారితో విడివిడిగా ఫోటోలు దిగారు. మొత్తం 55 మంది విద్యార్ధులకు రూ.55 లక్షలు ఇచ్చారు. విద్యార్ధులు అంతా పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సమావేశం చివరిలో బోధనా సిబ్బంది, విద్యార్ధులు ముఖ్యమంత్రితో గ్రూపు ఫోటో తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img