epaper
Saturday, November 15, 2025
epaper

మహిళల సహకారంతో స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్: చంద్రబాబు

కాకతీయ, అమరావతి: మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతుందని ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందని ఆరా తీశారు. స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా..? అని ముఖ్యమంత్రి అడిగారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు చెప్పారు. గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండేదని.. ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందని.. అలాగే 13 జిల్లాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు వివరించారు.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు.. గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా.. ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని… అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..”ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా.. వాటిని సద్వినియోగం చేస్తారు.

ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందుతారు. అందుకే తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తా. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పిస్తే.. ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాం. ఒకప్పుడు బాలికా విద్యను ప్రొత్సహించేందుకు సైకిళ్లు ఇచ్చాం. ఇప్పుడు విద్యార్థినులు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చాం. దీని వల్ల బస్ పాసుల కోసం క్యూ లైన్లల్లో నిల్చొనే శ్రమ తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుంది.” అని సీఎం చెప్పారు.

సహకరిస్తోన్న మహిళలకు ధన్యవాదాలు

“స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అవసరం ఉంటేనే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే.. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి… వారికి చేయూత అందివ్వడానికే స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తున్నామని మహిళలకు చెప్పాను. ఆ మేరకు మహిళలు కూడా సహకరిస్తున్నారు.

రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని… దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు సహకరించిన విధంగానే మహిళలు భవిష్యత్తులోనూ సహకరించాలని కోరుతున్నాను. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు.. అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే.. మరింత ఉత్సాహంగా పని చేస్తాం. మరింత మేలు ప్రజలకు, మహిళలకు చేకూర్చగలం.” అని చంద్రబాబు వివరించారు.

బోర్డులు పెట్టండి… లైవ్ ట్రాకింగ్ అమల్లోకి తీసుకురండి…

“స్త్రీ శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుకా… ముందు భాగాన బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తంగా 8,458 స్త్రీ శక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్లకోసం పోటీ పడితే.. ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య ఎంత మేరకు పెరిగిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు.

పథకం ప్రారంభానికి ముందు 40 శాతం మహిళలు ప్రయాణిస్తే.. 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారని.. ఇప్పుడు 65 శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే.. 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు. అలాగే స్త్రీ బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రెండు, మూడు రోజుల్లో గుంటూరు డిపోలో స్త్రీ శక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతామని… ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి బస్సులకు లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు.

లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే.. బస్సుల వేళలు తెలుసుకుని.. ఆ మేరకు తమ ప్రయాణ సమయాలను మహిళలు ఫిక్స్ చేసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్ష సందర్భంగా ఆర్టిక్యులేటెడ్ ఈ – బస్సులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ తరహా బస్సులు ప్రస్తుతమున్న సాధారణ బస్సులకు… మెట్రో రైలుకు మధ్య మిడిల్ లెవెల్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థగా ఉంటాయని అధికారులు వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img