మడికొండలో రోడ్డు కబ్జాపై ఫిర్యాదు
కాకతీయ, మడికొండ : కాజీపేట మండలం 46వ డివిజన్ మడికొండ ఎస్సీ కాలనీలో మహిళా కమ్యూనిటీ హాల్ పక్కనున్న రహదారి భాగాన్ని కొందరు కబ్జా చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. జాంబవ సంఘం అధ్యక్షుడు వస్కుల ఆనంద్ నేతృత్వంలో స్థానికులు జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబంధిత పత్రాలు పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు కూడా జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు, కాలనీవాసులు పాల్గొన్నారు.


