epaper
Sunday, March 1, 2026
epaper

రూ. 40 కోట్లు అంచ‌నా!

రూ. 40 కోట్లు అంచ‌నా!

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
ఈసారి జాతరలో 788 హుండీలు
హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు
లెక్కింపును ప్రారంభించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. దీని కోసం దాదాపు పది రోజుల సమయం పట్టనుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి మేడారంలో 788 హుండీలను అధికారులు ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున భక్తులు మేడారం జాతరకు తరలివచ్చి తమ కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం మహాజాతర అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో పరిసమాప్తమైన నేపథ్యంలో హుండీల లెక్కింపు ప్రక్రియ ఈరోజు మొదలవడంతో హనుమకొండ నగరంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి లెక్కింపును లాంఛనంగా ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

లెక్కింపు ప్రక్రియలో 500ల మంది సభ్యులు

సమ్మక్క సారలమ్మ గద్దెల చెంత 588, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల చెంత 152 చొప్పున ఇంకా వడి బియ్యం కోసం 3, తిరుగువారం కోసం 40 మొత్తం 788 హుండీలను ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది, సేవా సమితి నుంచి 500 మంది సభ్యులు ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. దీనికోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

వేలల్లో మొదలై కోట్లకు చేరిన అమ్మవారి కానుకలు

సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా వచ్చే కానుకలు తొలుత వేలు, ఆ తర్వాత లక్షల్లోకి చేరి క్రమంగా కోట్లకు చేరుకుంది. 2018 సంవత్సరంలో రూ. 8.14 కోట్లు, 2020లో రూ. 9.87 కోట్లు, 2022లో రూ. 12.45 కోట్ల ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. 2024 జాతరలో రూ.13 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతరకు భక్తులు భారీగా పోట్టెత్తినందున ఆదాయం కూడా అదే రీతిలో పెరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img