epaper
Monday, March 2, 2026
epaper

విద్యారంగంపై కాంగ్రెస్‌కు శ్రద్ధే లేదు

విద్యారంగంపై కాంగ్రెస్‌కు శ్రద్ధే లేదు
“రైసింగ్ తెలంగాణ కాదు… ఫాలింగ్ తెలంగాణ”
ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఘాటు విమర్శలు

కాక‌తీయ‌, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యకు కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రవణ్, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగానికి అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పుకునే “రైసింగ్ తెలంగాణ” నినాదం వాస్తవానికి “ఫాలింగ్ తెలంగాణ”గా మారిందని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలపై వెచ్చించే ఖర్చులను వ్యయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడులుగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండున్నరేళ్లయినా విద్యా విధానం లేదు

ప్రభుత్వ బడులకు నిధులు లేకపోవడం, ప్రైవేటు విద్యాసంస్థలపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల రాష్ట్ర విద్యారంగం గందరగోళంలో పడిపోయిందని దాసోజు శ్రవణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రజాపాలన, పారదర్శకత కేవలం మాటలకే పరిమితమైందని, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వానికి నిజాయితీ లేకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆరోపించారు. నిజాయితీ లేమి, నిధుల కొరత, నియంత్రణ రాహిత్యం కలిసి విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని తెలిపారు. మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఆ మార్పుకు అనుగుణంగా స్పష్టమైన విద్యా విధానాన్ని రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమగ్ర విద్యా విధానం కూడా రూపొందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, విద్యారంగానికి మాత్రం తగిన నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కాకపోయినా అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన ప్రభుత్వం, ప్రొఫెసర్ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నారని, కానీ రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img