కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ధర్నా చేపట్టారు. కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయశాఖ మార్కెట్ ముందు.. భట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం రైతులతో కలిసి ధర్నాకు దిగారు.
సకాలంలో రైతులకు యూరియా అందడం లేదని ఫైర్ అయ్యారు. యూరియా కొరత ఉందని పడిగాపులు గాసినా..యూరియాను సరఫరా చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి విఫలం అయ్యిందని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మార్కెట్ ముందు ప్రధాన రహదారిపై రైతులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. దీంతో ఇరువైపుల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే హరీశ్ బాబును అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకున్నాయి.


