epaper
Monday, March 2, 2026
epaper

దళితులపై మాట్లాడే హక్కు ప్రవీణ్‌కు లేదు

దళితులపై మాట్లాడే హక్కు ప్రవీణ్‌కు లేదు
కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పొద్దు
బీఆర్‌ఎస్ హామీలన్నీ బూటకమే
పరకాలలో కాంగ్రెస్‌కు ప్రజల ఆశీస్సులు ఖాయం
కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

కాకతీయ, పరకాల : దళితుల సంక్షేమం గురించి మాట్లాడే నైతికత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమాత్రం లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోడెల మౌనిష దిలీప్‌, 21వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతితో కలిసి రేవూరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పరకాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అబద్ధాల ప్రచారం ఆపాలి
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న పరకాలలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రేవూరి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ కుట్ర చేసి బాంబులు పెట్టి కూల్చేసిందని ప్రవీణ్ మాట్లాడటం పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. ఓ ఐఏఎస్‌గా పనిచేసిన వ్యక్తి కనీస బాధ్యత లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. “కేసీఆర్ దళితుల కోసం ఏం చేశాడో చెప్పాలి. బీఆర్‌ఎస్ పాలనలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ఎన్ని కుటుంబాలకు మేలు జరిగింది?” అని ప్రశ్నిస్తూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు రేవూరి సవాల్ విసిరారు. దళిత నాయకుడిగా చెప్పుకునే ప్రవీణ్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.

బీఆర్‌ఎస్ మోసపూరిత హామీలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, దళితబంధు వంటి హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. పరకాల పట్టణం నిజమైన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ఒక్కటే మార్గమని రేవూరి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని, బీఆర్‌ఎస్ అబద్ధాలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img