epaper
Monday, March 2, 2026
epaper

కాకతీయ కథనాలతో కదిలిన విద్యుత్ శాఖ

కాకతీయ కథనాలతో కదిలిన విద్యుత్ శాఖ
మేడారంలో జాత‌ర‌లో ప‌వ‌ర్ క‌ట్ల‌తో భ‌క్తుల‌కు ఇబ్బందులు
కాంట్రాక్ట‌ర్ నిర్లక్ష్య పనులపై కాక‌తీయ‌లో వ‌రుస క‌థ‌నాలు
ఆల‌స్యంగానైఆ దిద్దుబాటు చర్యలు మొద‌లుపెట్టిన అధికారులు
రెడ్డిగూడెంలో నూతన లైన్ల ఏర్పాటు

కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో విద్యుత్ శాఖ వైఫల్యాలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఈ సమస్యలను కాకతీయ దినపత్రిక వరుస కథనాల రూపంలో ఫోటోలతో సహా వెలుగులోకి తేవడంతో విద్యుత్ శాఖలో చలనం వచ్చింది. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాతర వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రాత్రి వేళల్లో మేడారం పరిసర ప్రాంతాలు చీకటిమయంగా మారాయి. దర్శన క్యూలైన్లు, తాత్కాలిక దుకాణాలు, భక్తుల శిబిరాలు అంధకారంలో మునిగిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సమయాల్లో పవర్ కట్‌లు రావడం అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మధ్యలోనే ఆగిపోయిన పనులు

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రెడ్డిగూడెం గ్రామ పరిసరాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. రోడ్లపై విద్యుత్ స్తంభాలను అడ్డంగా వదిలేయడంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు. చీకట్లో స్తంభాలకు తగిలి కొంతమంది గాయపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ దుస్థితిని కాకతీయ దినపత్రిక క్షేత్రస్థాయి నుంచి ఫోటోలతో సహా ప్రచురించడంతో అధికారులు స్పందించక తప్పలేదు. కథనాల ప్రభావంతో విద్యుత్ శాఖ మధ్యలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించింది.

కొత్త లైన్ల ఏర్పాటుతో ఊరట

కథనాల అనంతరం రెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను అధికారులు వేగవంతం చేశారు. భక్తులకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. జాతర ముగిసినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార దిశగా పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జాతరలో తలెత్తిన విద్యుత్ సమస్యల వెనుక కాంట్రాక్టర్ ఎంపిక విధానమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో వరదలు, జాతరల సమయంలో స్థానిక అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్లతో పనులు చేయించి అధికారులు సమర్థవంతంగా విద్యుత్ పునరుద్ధరణ చేపట్టేవారు. కానీ ఈసారి హైదరాబాద్‌కు చెందిన కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంతో సమన్వయ లోపం ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థానిక పరిస్థితులపై అవగాహన లేని సంస్థకు బాధ్యతలు ఇవ్వడం వల్లే పనులు అస్తవ్యస్తంగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. జాతరకు వారం రోజుల ముందే పనులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండటంతో భక్తులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై అసహనం

జాతర సమయంలో వరుస పవర్ కట్‌లు, మధ్యలో ఆగిపోయిన పనులు, భద్రతా లోపాలు అధికారుల పనితీరుపై అనేక సందేహాలను రేకెత్తించాయి. కాకతీయ కథనాల ప్రభావంతో ఇప్పుడిప్పుడే అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇంతటి అవ్యవస్థ నెలకొందని ప్రజలు విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అనుభవజ్ఞులైన స్థానిక కాంట్రాక్టర్లను భాగస్వాములను చేస్తూ పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ కథనాల వల్లే సమస్యలకు పరిష్కారం దొరికిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img