సువర్ణకు బీసీ జేఏసీ చేయూత
బ్రెయిన్ బ్లడ్ క్లాట్‌తో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సాయం
దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : హుజురాబాద్ మండలం కనకలగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి సువర్ణ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ బీసీ జేఏసీ, గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ సభ్యులు మానవతా దృక్పథంతో ఆమెకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, పేద కుటుంబానికి చెందిన సువర్ణకు గత సంవత్సరం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చుచేసి శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఆమె పూర్తిగా కోలుకోలేదని తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ వంతుగా సహాయం అందించామని పేర్కొన్నారు.
సువర్ణ వైద్య చికిత్సకు మరింత సహాయం అవసరమని, దాతలు, సేవాభావం ఉన్న వారు ముందుకు వచ్చి చేయూత అందించాలని ఆయన కోరారు. విరాళాలు అందించదలచిన వారు తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు మూడు సున్నా సున్నా రెండు ఎనిమిది నాలుగు నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండలం ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ నిర్వాహకుడు గౌరీశెట్టి జగదీశ్వర్, బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, తాళ్లపల్లి అమరేంద్ర, పల్లె సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


