నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగసుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి అభిషేకించి, వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం స్వామి వారికి చతుర్వేద పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు,కోశాధికారి కొత్తగట్టు రాజేందర్ పాల్గొన్నారు.


