కాకతీయ, క్రైమ్ డెస్క్: దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా..ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. అదనపు కట్నం కాపురాల్లో చిచ్చుపెడుతుంది. ఫలితంగా మహిళలు బలి కావాల్సి వస్తుంది. తాజాగా అదనపు కట్నం కోసం అత్తామామలు భర్త ఓ మహిళలను చిత్రహింసలకు గురి చేసి నిప్పటించిన సంఘటన కలకలం రేపింది. గ్రేటర్ నోయిడాలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా షాక్ గురయ్యారు.
నోయిడాకు చెందిన నిక్కీ అనే మహిళలను కాలిన గాయాలతో గురువారం ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్థర్ జంగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. తన సోదరిని అత్తింటివారే హత్య చేశారంటూ మ్రుతురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక వీడియో ఒకటి లభ్యమైంది. అందులో మ్రుతిరాలి భర్త, అత్త ఆమె జుట్టును పట్టి లాగి కొడుతున్నట్లు..నిప్పంటిచిన ద్రుశ్యాలు కూడా కనిపించాయి. వీడియో ఆధారంగా పోలీసులు నిక్కీ భర్త విపిన్, అత్త, మామ, బావమరిది సహా నలుగురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే 2016లో గ్రేటర్ నోయిడాకు చెందిన నిక్కీ, ఆమె అక్క కంచన్ ను సిర్సా ప్రాంతానికి చెందిన అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా కారు, విలువైన వస్తువులను ఇచ్చినా..మరో 35 లక్షలు అదనపు కట్నం కావాలని అత్తామామలు తమను తరచుగా వేధింపులకు గురిచేసేవారని..మ్రుతురాలి సోదరి తెలిపింది. గురువారం అదనపు కట్నం కోసం నిక్కీని ఆమె భర్త విపిన్, అత్త గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని తెలిపింది. తన సోదరిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలిపింది. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని మ్రుతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.
అమ్మను నాన్న, నానమ్మ తన ముందే కొట్టారని మ్రుతురాలి ఆరేళ్ల కుమారుడు మీడియాకు చెప్పాడు. తర్వాత పైన ఉన్న గదిలోకి తీసుకెళ్లి అమ్మపై ఏదో పోసి లైటర్ తో నిప్పంటించాడని ఏడుస్తూ చెప్పడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. తమ కుమార్తెను దారుణంగా చంపిన విపిన్ ను ఎన్ కౌంటర్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశాడు.


