epaper
Friday, March 27, 2026
epaper

వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం

వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం

కాకతీయ, మేడారం బృందం : మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి వనం విడిచి భక్తజనంలోకి అడుగుపెట్టిన క్షణం మేడారం అడవులు భక్తి పారవశ్యంతో మారుమోగాయి. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం ప్రారంభమవడంతో లక్షలాది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన అపూర్వ ఘడియ సాకారమైంది. చిలకలగుట్టపై సంప్రదాయ పూజలు పూర్తైన అనంతరం, పూజారులు సమ్మక్క తల్లి కుంకుమ భరిణెను తీసుకుని మేడారం గద్దెల దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఈ సమయంలో భద్రతా ఏర్పాట్ల నడుమ ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు అధికారిక స్వాగతం పలికారు. ఈ లాంఛనాలు భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

జయజయధ్వానాలు.. పూనకాలతో మార్మోగిన అడవి
సమ్మక్క తల్లి కుంకుమ భరిణె జనంలోకి రాగానే “జయ జయ సమ్మక్క” అంటూ భక్తుల జయజయధ్వానాలు మేడారం అడవులన్నీ మారుమోగించాయి. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాలతో పరిసర ప్రాంతాలు దివ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అడుగడుగునా భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. సమ్మక్క తల్లి దర్శనంతో తమ మొక్కులు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు అపార విశ్వాసంతో ఎదురు చూశారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బంగారంగా భావించే బెల్లం సమర్పించుకునేందుకు సిద్ధమయ్యారు. వనదేవత ఆగమనంతో మేడారం జనసంద్రంగా మారింది.

మ‌రి కొద్ది సేప‌ట్లో గ‌ద్దెపైకి సమ్మక్క

రాత్రి 8:30 గంటల తర్వాత సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండటంతో భక్తుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. గద్దె వద్దకు చేరే ఆ మహాక్షణాన్ని కళ్లారా చూడాలని భక్తజనం శాంతంగా ఎదురుచూస్తోంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరగానే మేడారం మహా జాతర లాంఛనంగా పరాకాష్టకు చేరనుంది. ఈ అపూర్వ దృశ్యాలు మేడారంలో భక్తులకు గూస్‌బమ్స్ తెప్పిస్తూ, సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఆధ్యాత్మిక మహిమను మరోసారి చాటుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో...

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర...

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి.. కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ...

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి బాధితుల‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్...

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img