epaper
Thursday, March 26, 2026
epaper

కేసీఆర్‌కు నోటీసులు

కేసీఆర్‌కు నోటీసులు

నందిన‌గ‌ర్ నివాసానికి సిట్ బృందం

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచ‌ల‌నం

రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విచార‌ణ‌

65 ఏండ్లు దాటినందున కోరిన చోటే విచార‌ణ‌

ఇప్ప‌టికే కేటీఆర్‌, హ‌రీష్‌, సంతోష్‌రావుల విచార‌ణ‌

మండిప‌డుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించిన సిట్ అధికారులు.. నేరుగా కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్లు పైబడిన దృష్ట్యా కేసీఆర్‌కు విచారణ సమయంలో స్టేషన్ హాజరు ప్రత్యేక మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ స్టేషన్‌కు రావొచ్చు లేదంటే.. హైదరాబాద్‌లోని మరో ప్రాంతాన్ని సూచించవచ్చునని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను సిట్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావును అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల వినియోగం, రాజకీయ నేతల ఫోన్ల నిఘాపై ప్రధానంగా ఈ విచారణ సాగనున్నట్లు తెలిసింది.

దర్యాప్తు వేగవంతం

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా, ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్​ను కూడా ఫిల్‌ చేస్తూ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే ట్యాపింగ్ బాధితులుగా ఉన్న మొత్తం 618 మందిని దాదాపు అందరి స్టేట్మెంట్​ను రికార్డ్ చేసిన సిట్ అధికారులు, ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ తర్వాత మరికొంతమందిని పిలిచి విచారిస్తున్నారు.

ఎస్​ఐబీ ఏఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో

2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతూ, అక్రమ నిఘాకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను వెలుగులోకి తెచ్చింది. వీసీ సజ్జనార్ నాయకత్వంలో మరో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తు మరింత వేగవంతమైంది. దీని తర్వాత సిట్ ఇటీవల ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లను విచారించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు, విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశారు. అనేక వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు వెలుగులోకి రావడంతో, ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర గురించి ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి. భుజంగ రావు కూడా ప్రభాకర్ రావు నియామకం గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో పాలుపంచుకున్న సీనియర్ అధికారులు సంబంధిత కాలంలో మాజీ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను తరచుగా సందర్శించారని భుజంగ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ వాంగ్మూలాలు, వాటికి మద్దతుగా లభించిన ఆధారాల ఆధారంగా సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంతో దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఇటీవలే కేటీఆర్​ను లోతుగా విచారించిన సిట్

ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్​ను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లు, విరాళాలు సమకూర్చిన వారిలో పలువురు వ్యాపారుల మొబైల్స్​ నిఘాలో ఉన్నట్లుగా సిట్​కు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలిసింది. ఆయా ఫోన్​ నెంబర్లతో ఉన్న జాబితాను కేటీఆర్​ ముందు ఉంచి విచారించినట్లు సమాచారం. అలాగే ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా తమను బెదిరించి బీఆర్​ఎస్​కు ఎలక్ట్రోరల్​ బాండ్లు సమకూర్చే విధంగా చేశారంటూ కొంతమంది వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని కేటీఆర్​ సమాధానం ఇచ్చారు. వ్యాపారులు తమకు స్వచ్ఛందంగానే విరాళాలను ఇచ్చారని చెప్పినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేత‌న్న‌ను కాపాడండి

నేత‌న్న‌ను కాపాడండి రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయండి ‘బ్యాక్ బిల్లింగ్’...

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..! చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై...

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల టెన్త్,...

ఆర్టీసీలో జాబ్ రేస్‌..

ఆర్టీసీలో జాబ్ రేస్‌.. 198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం 26,160 మంది అభ్యర్థుల...

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌ ట్రాఫిక్ చలాన్లపై ప్ర‌భుత్వం క‌ఠిన రూల్స్‌ ఫైన్ చెల్లించ‌కుంటే ఆర్సీ,...

టెన్త్ పరీక్షలకు గుడ్‌బై?

టెన్త్ పరీక్షలకు గుడ్‌బై? విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం సంచలన వ్యాఖ్యలు ఎస్ఎస్‌సీ బోర్డు రద్దు...

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌.. మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌ మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు లారీల ఓన‌ర్ల నుంచి...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img