epaper
Monday, March 2, 2026
epaper

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలి : కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలి: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తి భావంతో నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసి కమిషనర్, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్ద లతో కలిసి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గణేష్ మండపాలకు విద్యుత్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలని, పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే మండపాలు వివాదాస్పద ప్రదేశాల్లో ఏర్పాటు చేయరాదని, డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నిమజ్జన సమయంలో భక్తి గీతాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, మతసామరస్యానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో 12 నిమజ్జన ప్రదేశాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, క్రేన్లు, ఈతగాళ్లను ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద సహా అన్ని ప్రదేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని చెప్పారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలోని 35 చెరువుల వద్ద ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని తెలిపారు. జీడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. నిమజ్జన ప్రదేశాల వద్ద శానిటేషన్, తాగునీటి సౌకర్యం, హైమాస్ట్ లైట్లు, క్రేన్ల వంటి ఏర్పాట్ల కోసం రూ.18 లక్షలు కేటాయించామని వివరించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img