కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ జిల్లా నాయకులు మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ. 8158 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అలాగే జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీ లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని కోరారు. ఈ దీక్షలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, సహాయ కార్యదర్శులు దుర్గం బోగేష్, గట్టు ఆకాష్, ఇతర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న రూ. 8158 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలి : ఎస్ఎఫ్ఐ దీక్ష..
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


