మంత్రి పొంగులేటిని కలిసిన ఇమ్మడి..
కాకతీయ,కారేపల్లి: రాష్ట రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయని చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిరావు వైరా నియోజకవర్గంలో కొంత రాజకీయపరంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. గుగులోతు సంతోష్ నాయక్, గుగులోత రవి నాయక్, భూక్యా రవీందర్ ఉన్నారు.


