మరికొద్ది నిమిషాల్లో సారలమ్మ గద్దెపైకి…
– భక్తులకు వేగవంతమైన దర్శనం
కాకతీయ, మేడారం బృందం : మరికొద్ది నిమిషాల్లో సారలమ్మ అమ్మవారు గద్దెపైకి రానుండటంతో మేడారం జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులను క్రమబద్ధంగా ముందుకు పంపిస్తూ, కేవలం పది నిమిషాల్లోనే దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. దర్శన మార్గాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టగా, వైద్య బృందాలు, అత్యవసర సేవలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. అమ్మవారి గద్దె దర్శనం సందర్భంగా భక్తులు అధికారులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.


