గద్దెపై కొలువుదీరిన సారలమ్మ
కాకతీయ, రామకృష్ణాపూర్ : స్థానిక ఆర్కే వన్ గని పాలవాగు సమీపంలో ఏర్పాటు చేసిన గద్దెల వద్ద సారలమ్మ బుధవారం కొలువుదీరింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం తల్లిని గద్దెపై ప్రతిష్టించారు. ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సారలమ్మను దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్కే వన్ సమీపంలోకి చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు


