epaper
Wednesday, January 28, 2026
epaper

మున్సిపల్ ఎన్నికల్లో

మున్సిపల్ ఎన్నికల్లో

బీఆర్ఎస్‌కు పట్టంకట్టాలి

గులాబీ పార్టీతోనే కరీంనగర్ నగర అభివృద్ధి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేంలేదు

రెండేళ్ల‌లో ఎలాంటి నిధులు తీసుకురాలేదు

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

ఐదవ డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఐదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఐదవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గాదె రూప–శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన గంగుల కమలాకర్‌కు డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా నగర అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి ఎలాంటి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో దుర్షేడ్, గోపాలపూర్, బొమ్మకల్ తదితర డివిజన్లలో ప్రజలు బీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఐదవ డివిజన్ అభ్యర్థి గాదె రూప–శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ కాకతీయ, కరీంనగర్ : రథసప్తమి సందర్భంగా శిశు...

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ గిరిజన కుంభమేళాను విస్మరించ‌డం బాధాక‌రం పండుగ వేళ...

ప‌క‌డ్బందీగా నామినేషన్ ప్ర‌క్రియ‌

ప‌క‌డ్బందీగా నామినేషన్ ప్ర‌క్రియ‌ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాలి అధికారుల‌కు కలెక్టర్ పమేలా సత్పతి...

వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక..

వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక.. కాకతీయ,హుజురాబాద్‌: మున్సిపల్ ఎన్నికల...

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి సిద్ధిపేట క‌లెక్ట‌ర్ కె. హైమావతి నామినేషన్...

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు హస్తం గూటికి తాజా మాజీ చైర్మన్, వైస్‌చైర్మన్ మున్సిపల్...

నిధుల్లేవు.. పనుల్లేవు..!

నిధుల్లేవు.. పనుల్లేవు..! కరీంనగర్‌లో రెండేళ్లలో అభివృద్ధి శూన్యం కేంద్రం–రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల నగరానికి నష్టం బీఆర్ఎస్...

వేములవాడ అభివృద్ధి మా బాధ్యత

వేములవాడ అభివృద్ధి మా బాధ్యత ప్రజాపాలనలో సంక్షేమ–అభివృద్ధి సమతుల్యం ఆలయ, ప‌ట్ట‌ణాభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img