భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాల
రాష్ట్ర వైద్యా,ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్ర నాయక్
కాకతీయ,ఆత్మకూరు : అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యాశాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన అగ్రంపహాడ్ సమ్మక్క- సారళమ్మ జాతరలో ఏర్పాటు చేసిన ప్రాథమిక కేంద్రానికి అనారోగ్యశమస్యలతో ఎవరైనా భక్తులు వస్తే మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులకు సూచించారు.భక్తులకు జాతర ముగిసేవరకు 24 గంటలు 108 వాహనం భక్తులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.అనంతరం కటాక్షపూర్ లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరన్ని తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం కటాక్షపూర్ లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరన్ని తనిఖీ చేసి వైద్యధికారి స్పందనను వైద్యశిబిరానికి కావలసిన వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆత్మకూరు ప్రధాన రహదారిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24/7 సేవలు అందించాలని ,108 మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ తో సమన్వయంతో పనిచేయాలన్నారు. హనుమకొండ జిల్లాలోని మినీ సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన (22) వైద్య శిబిరాలలో భక్తులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు


