ఎంపీడీవోను అభినందించిన కాస్య తండా సర్పంచ్
కాకతీయ, నెల్లికుదురు: నెల్లికుదురు మండల ఎంపీడీవో కుమార్ ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికైనందుకు మండలంలోని కాస్య తండా గ్రామ సర్పంచ్ బోడ నరసింహ నాయక్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహ నాయక్ మాట్లాడుతూ… గ్రామ సర్పంచిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా,
జిల్లా నుంచి ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికైన సందర్భంగా ఎంపీడీవో కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.


