బోధనలో మార్పు రావాలి
డీఈవో చైతన్య జైని
కాకతీయ, ఖమ్మం : బోధనలో మార్పు రావాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని అన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఐసిటి అంశాలపై రెండు రోజుల శిక్షణా తరగతులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ముఖ్యఅతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కంటెంట్, పెడగాజి, అసెస్మెంట్ కమ్యూనికేషన్ అంశాల్లో కూడా ఐసిటి వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తద్వారా మెరుగైన అభ్యసన ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ఈ రెండు రోజుల్లో గూగుల్ అంశాలపై అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల్లోని 508 ఉపాధ్యాయులకు రెండు విడుతలగా సాంకేతిక వినియోగం, ఐసిటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలకు లాప్టాప్ ఉపాధ్యాయులకు ట్యాబ్ లను అందజేశారు


