రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ
కాకతీయ, కరీంనగర్ : రథసప్తమి సందర్భంగా శిశు మందిర్‌లో జనవరి 20 నుంచి 27 వరకు వారం రోజుల పాటు సూర్య నమస్కారాల సప్తాహాన్ని నిర్వహించారు. ముగింపు రోజున నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీలో నాలుగో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోటీలో 75 మంది విద్యార్థులు 500కు పైగా, 27 మంది విద్యార్థులు 1000కు పైగా, ముగ్గురు విద్యార్థులు 1500కు పైగా సూర్యనమస్కారాలు చేసి విశేష ప్రతిభ కనబరిచారు. 1656 సూర్యనమస్కారాలతో బొజ్జ అక్షిత ప్రథమ స్థానం, 1655 సూర్యనమస్కారాలతో మనుపాటి ప్రియహర్షిణి ద్వితీయ స్థానం, 1654 సూర్యనమస్కారాలతో బూత్కూరి లసిక తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి మాట్లాడుతూ… విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం అలవర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, న్యాయవాది భీమనాథుని రజిని, వైద్యురాలు జి. శ్వేత బహుమతులు అందజేశారు. విద్యార్థులను డాక్టర్ చక్రవర్తుల రమణచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, కొత్తూరి ముకుందం, గోలి పూర్ణచందర్, గట్టు రామ్ ప్రసాద్ తదితరులు అభినందించారు.


