తొలి రోజు 5 నామినేషన్లు
వీరంతా బీఆర్ఎస్ అభ్యర్థులే
కాకతీయ, చేర్యాల: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చేర్యాల మున్సిపల్ కి సంబంధించి 12 వార్డు స్థానాలు ఉండగా మొదటి రోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ 5 మంది బీఆర్ఎస్ అభ్యర్థులే కావడం గమనార్హం. 1వ వార్డు నుంచి ఆవుశేర్ల నాగమణి, 2వ వార్డులో కమలాపురం గీతాంజలి, 4వ వార్డులో నిమ్మ సుప్రజ, 10వ వార్డులో మేడిశెట్టి ఉమ, 12వ వార్డులో శివగారి భవిత తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ పేర్కొన్నారు.


