epaper
Wednesday, January 28, 2026
epaper

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం

కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్

గిరిజన కుంభమేళాను విస్మరించ‌డం బాధాక‌రం

పండుగ వేళ ఎన్నికల ప్రక్రియ సరికాదు

మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మేడారం మహా జాతర రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మాజీ మేయర్‌, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ … తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న పోలింగ్‌, 13న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర జరుగుతున్న రోజుల్లోనే ఈ ప్రక్రియ నిర్వ‌హించ‌డం గిరిజనుల ఆత్మగౌరవానికి విఘాతం అని మండిపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారని ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా తేదీలు ముందుగానే ప్రకటించి ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఎన్నికల ప్రక్రియ ఖరారు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం గిరిజనులపై చిన్నచూపు చూపడమేనని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తోందని ప్రశ్నించిన ఆయన మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను పక్కనపెట్టి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర సమయంలో ప్రజలంతా అమ్మవార్ల దర్శనంలో ఉంటే నామినేషన్లు ఎలా వేయగలరని ప్రశ్నించారు. జాతర ముగిసిన తరువాతే షెడ్యూల్ ప్రకటించాల్సిందని లేకుంటే కక్షపూరిత నిర్ణయమనే అనుమానాలు బలపడతాయని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గిరిజనులు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ షెడ్యూల్ రూపొందించారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇకనైనా ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి రాబోయే ఎన్నికలను పండుగల సమయంలో నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతినేలా వ్యవహరించవద్దని ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు కల్పించాలని ఆయ‌న స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ ఎన్నికల్లో

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పట్టంకట్టాలి గులాబీ పార్టీతోనే కరీంనగర్ నగర అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ కాకతీయ, కరీంనగర్ : రథసప్తమి సందర్భంగా శిశు...

ప‌క‌డ్బందీగా నామినేషన్ ప్ర‌క్రియ‌

ప‌క‌డ్బందీగా నామినేషన్ ప్ర‌క్రియ‌ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాలి అధికారుల‌కు కలెక్టర్ పమేలా సత్పతి...

వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక..

వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక.. కాకతీయ,హుజురాబాద్‌: మున్సిపల్ ఎన్నికల...

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి సిద్ధిపేట క‌లెక్ట‌ర్ కె. హైమావతి నామినేషన్...

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు హస్తం గూటికి తాజా మాజీ చైర్మన్, వైస్‌చైర్మన్ మున్సిపల్...

నిధుల్లేవు.. పనుల్లేవు..!

నిధుల్లేవు.. పనుల్లేవు..! కరీంనగర్‌లో రెండేళ్లలో అభివృద్ధి శూన్యం కేంద్రం–రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల నగరానికి నష్టం బీఆర్ఎస్...

వేములవాడ అభివృద్ధి మా బాధ్యత

వేములవాడ అభివృద్ధి మా బాధ్యత ప్రజాపాలనలో సంక్షేమ–అభివృద్ధి సమతుల్యం ఆలయ, ప‌ట్ట‌ణాభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img