epaper
Wednesday, January 28, 2026
epaper

వనంలో వైభవం..

వనంలో వైభవం..
మేడారం మొదటి రోజు ఉత్సవం!
సారలమ్మ గద్దెపైకి రానున్న కీలక ఘట్టం
పూనకాలతో హోరెత్తిన అడవి ప్రాంతం
లక్షలాది భక్తులతో జనసంద్రంగా మేడారం

కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర మొదటి రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. జనవరి 28న అధికారికంగా ఆరంభమైన జాతరతో ములుగు జిల్లా అరణ్య ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టగా, అడవీ ప్రాంతం మొత్తం జనసంద్రాన్ని తలపిస్తోంది. జాతరలో తొలిరోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ (సారక్క) తల్లిని గిరిజన పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో మేడారం గద్దెపైకి తీసుకువచ్చే కీలక ఘట్టం జరగనుంది. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. అమ్మవారి ఆగమనంతో జాతర వాతావరణం మరింత ఉత్సాహంగా మారనుంది.

పూనకాలతో హోరెత్తిన మేడారం

అమ్మవార్ల రాకను పురస్కరించుకుని మేడారం వనం పూనకాలతో హోరెత్తుతోంది. భక్తులు శివాలూగుతూ, డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. అడవంతా భక్తి గీతాలతో మార్మోగుతోంది. ఇప్పటికే సమ్మక్క భర్త పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి, గోవిందరాజులు కొండాయి నుంచి మేడారం చేరుకున్నారు. ఈ దేవతలందరినీ తొలిరోజే గద్దెలపై ప్రతిష్ఠించనుండటం విశేషం. ఈ ఘట్టంతో మేడారం మహాజాతర పూర్తిస్థాయిలో ఉత్సవ శోభను సంతరించుకుంది. మేడారం పరిసరాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. తమ బరువుకు సమానమైన బెల్లాన్ని (బంగారం) వనదేవతలకు సమర్పిస్తూ భక్తులు పునీతులవుతున్నారు. జాతరకు సుమారు కోటి నుంచి కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతర తొలి రోజు భక్తి, ఉత్సాహం, సంప్రదాయాల సమ్మేళనంగా సాగుతోంది. రేపు చిలకలగుట్ట నుంచి ప్రధాన దేవత సమ్మక్క తల్లి గద్దెపైకి రానుండటంతో జాతర మరింత వైభవంగా కొనసాగనుంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జంపన్నవాగులో విషాదం..!

జంపన్నవాగులో విషాదం..! పుణ్యస్నానమే ప్రాణాంతకం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భక్తుడు గాలింపునంతరం మృతదేహం లభ్యం అప్రమత్తంగా ఉండాలని...

కారు గుర్తుపై ప్రజల నమ్మకం పటిష్టం

కారు గుర్తుపై ప్రజల నమ్మకం పటిష్టం : మాజీ ఎమ్మెల్యే పెద్ది...

మేడారంలో తొక్కిసలాట

మేడారంలో తొక్కిసలాట క్యూలైన్ల వద్ద భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఓ మహిళకు తలకు తీవ్ర...

మేడారం మార్గంలో విషాదం..!

మేడారం మార్గంలో విషాదం..! ట్రాక్టర్ బోల్తా.. తల్లీకూతుళ్ల దుర్మరణం 17 మందికి పైగా గాయాలు.....

జ‌న‌సంద్రంగా మేడారం

జ‌న‌సంద్రంగా మేడారం త‌ల్లీ సార‌ల‌మ్మ కోసం ఎదురు చూపు సాధార‌ణ క్యూలైన్లు దాటి మేడారం...

చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు

చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా...

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..! సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం తొలిరోజు...

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో..

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో.. అన్ని దారులూ వ‌న‌దేవ‌త వైపే వాహ‌నాల‌తో కిక్కిరిసిపోతున్న ములుగు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img