చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు
కాకతీయ, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగాల–పూనుగొండ్ల నుంచి బయలుదేరిన శ్రీ మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు పయనం కొనసాగుతోంది. గురువారం గోవిందరావుపేట మండలంలోని చంద్రు తండకు పగిడిద్దరాజు చేరుకున్నారు. సాంప్రదాయ పూజలు, గిరిజన ఆచారాల మధ్య పగిడిద్దరాజు ప్రయాణం భక్తిశ్రద్ధలతో సాగుతోంది. దేవునితో పాటు పూజారులు పిడక రాజేశ్వర్, వెనక రాజేశ్వర్, పెనుక రామస్వామి, పెనుక సురేందర్, పెనుక వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మార్గమంతా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో కీలక ఘట్టంగా భావించే పగిడిద్దరాజు పయనం సందర్భంగా ఆయా గ్రామాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ముందువైపు పగిడిద్దరాజు మేడారం గద్దెలకు చేరుకోనుండగా, ఆ ఘట్టానికి గిరిజనులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


