కరీంనగర్‌లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పాత మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయంగా అందించే పట్టు వస్త్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోక్‌నాథ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆర్డీవో మహేష్, ఆలయ ఈవోతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు.


