అల్ఫోర్స్ ఇ-టెక్నోకు గోల్డ్ గ్లోరీ
అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్లో బంగారు పతకాలు
ఇంగ్లీష్‌పై పట్టు అవకాశాలకు తాళం చెవి : డా. నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ అధినేత డా. వి. నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని పాఠశాలలో అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకమని, నిరంతర సాధనతో పటిష్టమైన భాషా నైపుణ్యాలు సాధిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని సూచించారు. కఠిన సాధనతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఇటీవల ఎస్ఓఎఫ్ నిర్వహించిన అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్లో పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు.
విజేతలు:
సైదా ఝాన్ జహాన్ (5వ), సిహెచ్ ప్రజ్ఞసాయి, పి. శాన్వి, ఎస్. విశాల్ (6వ), ఆయేషా, ఏ. అక్షయగ్న రెడ్డి, మొహమ్మద్ అబ్దుల్ అర్హమ్ (7వ), సిహెచ్ విగ్నేష్, పి. శృతి సాగర్ (8వ).
విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


