బీఆర్‌ఎస్‌వి 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
పార్టీ బలోపేతానికి యువత కృషి అభినందనీయం
మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు
కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వి) నాయకుడు బద్దం ప్రవీణ్ రెడ్డి రూపొందించిన 2026 క్యాలెండర్‌ను మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ, పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బద్దం ప్రవీణ్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. యువతను ఉద్యమాత్మకంగా చైతన్యపరిచి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.


