ఉపాధిహామీ పథకం యథావిధిగా కొనసాగాలి
కేంద్ర నిర్ణయానికి కాంగ్రెస్ నిరసన
చెల్పూర్‌లో ఏకగ్రీవ తీర్మానం
కాకతీయ, హుజురాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో ఉపాధిహామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పేరు మార్పు, నూతన మార్గదర్శకాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ అబ్జర్వర్ మహమ్మద్ గౌస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే పథకాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధిహామీ వంటి కీలక పథకాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి–రఘు, వెంకట్రావుపల్లి సర్పంచ్ పత్తి అనిత–కృష్ణారెడ్డి, సింగపూర్ సర్పంచ్ కలవల సంపత్, మాందాడిపల్లి సర్పంచ్ వేల్పుల విజయ–కుమారస్వామి, తుమ్మనపల్లి సర్పంచ్ అన్నాడి మాధవి–రవీందర్ రెడ్డి, అంబేద్కర్ నగర్ సర్పంచ్ ఇమ్మడి దయాకర్, హుజురాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా, యువజన విభాగాల నేతలు పాల్గొన్నారు.


