వైభవంగా “కంకవనం” పూజ
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఆర్కే వన్ ఏ గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే సమ్మక్క – సారలమ్మ జాతరలో భాగంగా మంగళవారం కంకవనం పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజిఎం లలిత్ ప్రసాద్,డీజీఎం పర్సనల్ అశోక్,సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య,డీజీఎం ఐఈడి కిరణ్ కుమార్,ఉన్నత అధికారులతో పాటు ఏఐటీయూసీ యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.


