epaper
Sunday, March 15, 2026
epaper

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?
పదేపదే మత్తడి ధ్వంసం.. అధికారుల మౌనం
చివరి ఆయకట్టుకు నీరు లేక పంటలపై ప్రభావం
విచారణ కోరుతూ రుద్రగూడెం రహదారిపై రైతుల‌ రాస్తారోకో
తక్షణ చర్యలు చేప‌ట్ట‌క‌పోతే ఉద్యమం ఉధృతమంటూ హెచ్చ‌రిక‌

కాకతీయ, నల్లబెల్లి : వ‌రంగ‌ల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. రంగాయి చెరువు చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు మంగళవారం రుద్రగూడెం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే రైతుల ఆవేదన కేవలం నీటి కొరతకే పరిమితం కాకుండా, నల్లమట్టు చెరువు మత్తడి ధ్వంసం వెనుక దురుద్దేశాలు ఉన్నాయా? అనే అనుమానాలకు దారి తీసింది.
నల్లమట్టు చెరువులోని మత్తడి గత కొన్ని రోజులుగా పలుమార్లు ధ్వంసం కావడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఒకసారి కాదు, వరుస ఘటనలుగా మత్తడి దెబ్బతింటున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?” అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదని వారు విమర్శిస్తున్నారు.

నీరు లేక ఎండుతున్న పొలాలు
చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. పంటల కీలక సమయంలో కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. అధికారుల మౌనం అనుమానాలను మరింత బలపరుస్తోందని, సమస్యను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదన్న భావన రైతుల్లో నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి మత్తడి ధ్వంసానికి కారణాలను గుర్తించాలని రైతులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు చివరి ఆయకట్టువరకు సమానంగా సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో మొదటి ఆయకట్టు–చివరి ఆయకట్టు రైతుల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పోలీసుల జోక్యంతో విరమణ
సమాచారం అందుకున్న ఎస్సై గోవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. మొత్తానికి, నల్లమట్టు మత్తడి ధ్వంసం వెనుక నిజాలు వెలుగులోకి రావాలంటే తక్షణ, పారదర్శక విచారణే మార్గమని రైతులు స్పష్టం చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం మరింత ఉధృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు పెళ్లి చేస్తానని...

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,...

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు టెన్త్ ప‌రీక్ష కేంద్రాల‌ను తనిఖీ చేసిన కలెక్టర్ మౌలిక...

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img