epaper
Tuesday, January 27, 2026
epaper

మున్సిపోల్స్‌కు మోగిన న‌గారా

మున్సిపోల్స్‌కు మోగిన న‌గారా

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

రేప‌టి నుంచే నామినేష‌న్లు

116 మున్సిపాలిటీలు,

7 కార్పొరేషన్లకు ఎన్నిక‌లు

వివ‌రాలు వెల్ల‌డించిన ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్

పుర పోరుకు ప్ర‌ధాన పార్టీలు రెడీ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ‌నుండ‌గా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది.
ఈమేర‌కు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రీపోలింగ్‌ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు కమిషనర్​ వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

136 పోలింగ్ కేంద్రాలు

ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​ల ఎన్నిక ఉంటుందని రాణి కుముదిని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరుగనుండగా, 8,203 పోలింగ్‌ కేంద్రాలు, 136 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ ఎస్‌ఈసీ రాణి కుముదిని ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సీఎస్ రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీ మహేశ్‌ భగవత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఈసీ ఎన్నికల కోడ్ అమలు, తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

రిజర్వేషన్లు ఇలా ..

మున్సిపల్‌ ఎన్నికల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్ స్థానాలను పరిశీలిస్తే బీసీ జనరల్‌- 463, బీసీ మహిళలు- 391, ఎస్సీ జనరల్‌- 254, ఎస్సీ మహిళలు- 190, ఎస్టీ జనరల్‌- 147, ఎస్టీ మహిళలు- 40, జనరల్‌ వార్డులు- 647, జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ వార్డులు- 864గా ఉన్నాయి.

రాజకీయ పార్టీల వ్యూహాలు

మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజకీయ పార్టీలు స‌ర్వ సన్నద్ధంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీఆర్​ఎస్​, బీజేపీ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకున్న బీఆర్​ఎస్​ ప్రస్తుత ఎన్నికల్లో రకరకాల వ్యూహాలను రచిస్తోంది. ఈ బాధ్యతను ముఖ్యంగా కేటీఆర్​ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి కొన్ని జిల్లాల్లో ఏకంగా బహిరంగ సభలే నిర్వహించారు. ​ పార్టీని గెలిపిస్తేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలను కోరారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి త‌దిత‌రులు ప్రచారంలోకి దిగ‌నున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..! సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం తొలిరోజు...

మున్సిపల్ ఎన్నికల నగారా..!

మున్సిపల్ ఎన్నికల నగారా..! నేడు షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో...

మేడారంలో మెగా వైద్య భద్రతా

మేడారంలో మెగా వైద్య భద్రతా యాభై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ముప్పై...

కేటీఆర్‌కు సిగ్గుండాలె

కేటీఆర్‌కు సిగ్గుండాలె ఇప్పుడు సంసారి లెక్క మాట్లాడుతుండు కేసీఆర్ కుటుంబంతో ప్ర‌మాణం చేయాలె టెర్ర‌రిస్ట్ పేరుతో...

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు సింగరేణిపై క‌ల్పిత కట్టు కథనాలు నా వ్యక్తిత్వ హననం చేసేలా...

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం ఇప్పటివరకు 3,836...

కేస‌ముద్రంలో హోరాహోరీ

కేస‌ముద్రంలో హోరాహోరీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌ కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ...

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌ సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత‌ 15 మంది మావోయిస్టులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img