ప్రశ్నించే గొంతుకగా ‘కాకతీయ’
ప్రజా సమస్యలపై ధైర్యమైన కథనాలు ప్రశంసనీయం
2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
కాకతీయ, రామకృష్ణాపూర్ : అనతి కాలంలోనే ప్రశ్నించే గొంతుకగా కాకతీయ తెలుగు దినపత్రిక అగ్రగామిగా నిలిచిందని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకతీయ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై కాకతీయ అందిస్తున్న కథనాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజ హితానికి దోహదపడే వార్తలతో పాటు ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించే కథనాలు ప్రచురిస్తూ విశ్వనీయతను మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రజల తరఫున ప్రశ్నించే ధైర్యం పత్రికలకు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి, పల్లె రాజు, మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


