టీచర్లకు వ్యక్తిత్వ వికాస శిక్షణ
మాస్టర్జీ హై స్కూల్‌లో గీత భాస్కర్ ప్రేరణాత్మక ప్రసంగం
మంచి లక్షణాన్ని పెంపొందించుకుంటే జీవితం మారుతుందని హితవు
కాకతీయ, హన్మకొండ : హన్మకొండలోని మాస్టర్జీ హై స్కూల్లో విద్యా సంస్థల ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు దాస్యం గీత భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గీత భాస్కర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కొత్తగా ఏమి నేర్చుకున్నామో స్వయంగా గమనించుకోవాలని సూచించారు. టెక్నాలజీని నేర్చుకుంటూనే మన మూలాలు, సంస్కృతి, విలువలను మరవకూడదని అన్నారు. ఒక మనిషిలో తొమ్మిది చెడు లక్షణాలు ఉన్నా ఒక్క మంచి లక్షణం ఉంటే దానిని నిరంతరం పెంపొందించుకుంటే కాలక్రమంలో వ్యక్తి మంచి మార్గంలోకి వస్తాడని తెలిపారు. కుటుంబ సభ్యులతో గానీ, సమాజంతో గానీ సంబంధాలు బలంగా ఉండాలంటే మంచి లక్షణాలపై దృష్టి పెట్టి, లోపాలను విస్మరించడం అవసరమని చెప్పారు. అలా చేస్తే జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్జీ విద్యా సంస్థల చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు, డైరెక్టర్ ఆశా జ్యోతి, ప్రిన్సిపల్స్ దామెర్ల రజిత, రాగి వాణి, షిలొహ్, ఈసంపల్లి సునీల్, అడ్మిన్ డీన్ సంయుక్త, ప్రీ-ప్రైమరీ కోఆర్డినేటర్ లంక లావణ్య, ఏఓ కక్కెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


