విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 6వ డివిజన్‌లోని రస్తోగి నగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో మన కాలనీ ప్రశాంతి నగర్ వాసి ఐన గుగులోతు రమేష్, అనసూయ దంపతుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఉపయోగపడే ప్లేట్లు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 6వ డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొని గుగులోతు రమేష్, అనసూయ దంపతులను సేవలను అభినందించారు. విద్యార్థులు ఈ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


